Balakrishna: బాలయ్యపై ఇంత భారీ బడ్జెట్ వర్కవుట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖండ.. వీరసింహారెడ్డి.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఫుల్ ఫామ్‌లో వున్నాడు. వీరసింహారెడ్డితో నాలుగో హిట్ వెనకేసుకున్నాయి. అయితే… సినిమా సినిమాకూ బడ్జెట్ పెరిగిపోవడం ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. ఇక సెట్స్‌పై వున్న అఖండ2 అయితే బడ్జెట్ లిమిట్స్ దాటేసింది. బాలయ్య కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ డబ్బులు పెట్టేయడంతో.. బడ్జెట్ ఎక్కడుకెళ్లి ఆగుతుందో తెలీయడం లేదు.
Also Read :Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
వరుసగా నాలుగు హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో వున్న బాలయ్య రెమ్యునరేషన్ పెంచకుండా వుంటాడా? అఖండ ముందు వరకు 10 కోట్లున్న బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్లకు చేరడంతో.. ఆటోమెటిక్‌గా బడ్జెట్ పెరిగిపోతుంది. ప్రస్తుతం బాలయ్య రెమ్యునరేషన్తో గతంలో సినిమా పూర్తయ్యేది. సినిమా సినిమాకూ బాలకృష్ణ బడ్జెట్ పెరగడంతోపాటు.. బిజినెస్ కూడా పెరుగుతోంది. అఖండను 53 కోట్లకు అమ్మితే 75 కోట్లు తీసుకొచ్చింది. వీరసింహారెడ్డి దగ్గరకొచ్చేసరికి ఒకేసారి బిజినెస్ 20 కోట్లు పెరిగి 73 కోట్లకు అమ్మగా 80 కోట్లు రాబట్టింది. ఇక భగవంత్ కేసరి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో బిజినెస్ తగ్గి 67 కోట్లకే జరిగితే.. 71కోట్లు వచ్చింది. డాకూ మహరాజ్‌ను 80 కోట్లకు అమ్మితే.. 82 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read :The Great Pre Wedding Show: ఆసక్తికరంగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్
బాలకృష్ణ గత నాలుగు సినిమాల బిజినెస్.. కలెక్షన్స్ చూస్తుంటే..బాలయ్య 80 కోట్ల మార్క్ దాటడమే గగనమైపోతోంది. 82 కోట్లు కలెక్ట్ చేసిన డాకు మహారాజ్ హయ్యెస్ట్ షేర్‌గా నిలిచింది. ఇలా 100 కోట్ల క్లబ్ బాలయ్యను ఊరిస్తుందేగానీ.. దక్కడం లేదు. బడ్జెట్ మాత్రం అఖండతో 100కోట్లు దాటేసింది. అఖండ2 వచ్చేసరికి బోయపాటి బడ్జెట్‌ను భారీగా పెంచేశాడు. హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో వుంటాయి. ఇంతవరకు 100 కోట్ల కలెక్షన్స్ లేని బాలయ్యపై 120 కోట్ల బడ్జెట్ పెట్టేయడం రిస్కేగానీ.. హిట్ టాక్ వస్తే.. పెద్ద కష్టం కాకపోవచ్చు.
అఖండ2 తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరసింహారెడ్డి సక్సెస్ తర్వాత ఈ హిట్‌కాంబో రిపీట్ అవుతోంది. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అఖండ2 బడ్జెట్ 120 కోట్లే ఎక్కువంటే.. గోపీచంద్ ఇంతకుకమించి బడ్జెట్ పెట్టిస్తున్నాడని తెలిసింది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ కథను రాసుకోవడంతో.. ఖర్చు ఎక్కువే అవుతోందట. బాలకృష్ణ వరుసగా 4 హిట్స్‌తో ఎంత ఫామ్‌లో వున్నా.. 120 కోట్లకు పైగా బడ్జెట్ అంటే.. థియేటరికల్ రైట్స్ కూడా 100 కోట్లు దాటేస్తుంది. ఒకరకంగా ఇది రిస్క్ చేయడమే. బాలయ్య అంటే ఒకప్పుడు తక్కువ బడ్జెట్.. ఎక్కువ లాభాలన్న పేరుండేది. హిట్ కాంబినేషన్ పేరు చెప్పి బడ్జెట్‌ను 100 కోట్లు దాటించేస్తున్నారు.
తాజావార్తలు
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!