తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
Also Read : Vamsi Paidipally : పవన్‌కల్యాణ్‌తో అసలు వంశీ పైడిపల్లి సినిమా సాధ్యమేనా?
హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కోసం ఇంత మంది దర్శకులు వచ్చారు. నేను ఇంత మంది మంచి ఫ్రెండ్స్‌ను దర్శకుల రూపంలో సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.