Dada Release Date: ‘అఖండ 2’ సీన్ రిపీట్ కానుందా? బాలయ్య ‘దాదా’పై సస్పెన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dada Release Date: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’ చుట్టూ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. గతంలో ‘అఖండ 2’ రిలీజ్ విషయంలో ఎలాంటి గందరగోళం, వాయిదాల పర్వం సాగిందో.. ఇప్పుడు ‘దాదా’ విషయంలోనూ దాదాపు అదే సీన్ రిపీట్ కానుందా అన్న అనుమానాలు సినీ వర్గాల్లో బలపడుతున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. చెప్పిన డేట్‌కే వస్తుందా లేక రేస్ నుంచి తప్పుకుంటుందా అనే సందిగ్ధత నందమూరి అభిమానులను తీవ్ర టెన్షన్‌కు గురిచేస్తోంది.
‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని – బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదటినుంచీ భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ను దసరా బరిలోనే దించాలని భావించినా, షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 24కి మార్చారు. తీరా కాకినాడ పోర్టులో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా బాలకృష్ణకు కాలుజారి గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. దాదాపు రెండు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో అసలు క్రిస్మస్కు రావడం అసాధ్యమనే ప్రచారం ఊపందుకుంది. అయితే డేట్ మిస్ కాకూడదన్న పట్టుదలతో బాలయ్య గాయం నుంచి కోలుకున్న వెంటనే నాన్‌స్టాప్‌గా రంగంలోకి దిగారు. మైసూర్ షెడ్యూల్ ముగించుకుని, రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగు రోజుల పాటు భారీ యాక్షన్ సీన్స్ పూర్తి చేశారు. కానీ కాకినాడలో మిగిలిపోయిన ఫైట్ సీక్వెన్స్‌ను రీ-షూట్ చేద్దామనుకునే సమయానికి తీరం దాటిన తుఫాను, ఎడతెరిపిలేని భారీ వర్షాలు యూనిట్ ప్లాన్‌ను పూర్తిగా దెబ్బతీశాయి.
Also Read
ప్రస్తుతం రిలీజ్‌కు కేవలం 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంకా బాలయ్య, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ఒక పాటతో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులకు కూడా తగినంత సమయం అవసరం. ఇంత తక్కువ టైంలో వాటన్నింటినీ పూర్తి చేసి డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురావడం మేకర్స్‌కు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ రూమర్లపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తుందా.. లేక గత అనుభవాల దృష్ట్యా సైలెంట్‌గా ఉండి రిలీజ్ డేట్‌ను మార్చుతారా అన్నది చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Dada Release Date: ‘అఖండ 2’ సీన్ రిపీట్ కానుందా? బాలయ్య ‘దాదా’పై సస్పెన్స్!
-
Minister Uttam Kumar Reddy: బడ్జెట్‌కు మించి నిధులిస్తాం..! భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం భరోసా
-
Journey of Ramayana: 1917 నుంచి 2026 వరకు.. వెండితెరపై ‘రామాయణ’ వందేళ్ల అద్భుత ప్రయాణం!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎస్ఈసీ కీలక ప్రకటన..
-
Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!