Nandi Awards Jury: ఏపీ సర్కార్ నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandi Awards Jury: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘నంది’ అవార్డుల పండగకు రంగం సిద్ధమైంది. సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా 2025 సంవత్సరానికి గానూ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా స్టార్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమిస్తూ తాజాగా జీవో విడుదలైంది. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించింది.
కమిటీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ (ఎమ్మెల్యే), సభ్యులుగా అల్లు అరవింద్ (నిర్మాత), ఎస్.గోపాల్ రెడ్డి (సినీ ప్రముఖులు), ప్రభ (సీనియర్ నటి), కన్వీనర్‌గా APSFTvTDC మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించనున్నారు. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన 2017 నుంచి 2025 వరకు ఉన్న నంది అవార్డులన్నింటినీ త్వరలోనే అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి, వచ్చే నెల అంటే డిసెంబర్లోనే అవార్డుల ప్రదానోత్సవ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకను విజయవాడ లేదా అమరావతిలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ నంది అవార్డుల సందడి మొదలవ్వడం, అందులోనూ బాలకృష్ణ ఛైర్మన్‌గా, అల్లు అరవింద్ లాంటి సీనియర్లు జ్యూరీ సభ్యులుగా నియమితులవడంతో సినీ, టీవీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Also Read
- Alias Rukmini: నాని పట్టుబట్టి మరీ నాకు సినిమా ఇప్పించాడు.. ‘అలీయాస్ రుక్మిణి’పై నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Alias Rukmini : అమ్మాయి పేరుతో నితిన్ ‘కోరికలే గుర్రాలైతే’ పుస్తకాలు! ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ అదిరిందిగా!
- Amitabh Bachchan: 26/11 రోజే ముంబైలో కలకలం.. మళ్లీ బిగ్‌బీకి బాంబు బెదిరింపులు!
- Nandi Awards : ఏకంగా 9 ఏళ్ల ‘నంది’ అవార్డులకు గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Nandi Awards Jury: ఏపీ సర్కార్ నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ!
-
OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
-
Alias Rukmini: నాని పట్టుబట్టి మరీ నాకు సినిమా ఇప్పించాడు.. ‘అలీయాస్ రుక్మిణి’పై నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?
-
CM Revanth Reddy: అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తా.. బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ నిప్పులు..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!