Kichcha Sudeep: బిల్లా రంగా బాషా గా కిచ్చా సుదీప్.. కాన్సెప్ట్ వీడియో అదుర్స్..
- నేడు కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ పుట్టిన రోజు
- సుదీప్ నూతన చిత్రం కాన్సెప్ట్ రిలీజ్ చేసిన మేకర్స్
- BRB ను నిర్మిస్తున్న హనుమాన్ నిర్మాత
కన్నడ సూపర్ స్టార్ బాద్షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారితో మరోసారి చేతులు కలిపారు, గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘విక్రాంత్ రోనా’ సూపర్ హిట్ సాధించింది.ఇప్పుడు వీరిరువురు కలిసి బిల్లా రంగా బాషా(BRB) గా రాబోతున్నారు. హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Also Read: Jr.NTR : కేశవనాథేశ్వరనాలయంలో జూ. ఎన్టీయార్.. వీడియో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి
Also Read
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
- Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా 2209 A.D లో జరిగే కథను పరిచయం చేసే కాన్సెప్ట్ వీడియోతో పాటు ‘బిల్లా రంగ బాషా’ యొక్క ‘అఫీషియల్ లోగో’ని మేకర్స్ రిలీజ్ చేసారు. కాన్సెప్ట్ వీడిలో క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించిన ఒక సంగ్రహావలోకనం, ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్ మరియు తాజ్ మహల్ అన్నీ ధ్వంసమయ్యాయి మరియు ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు కనిపిస్తోంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు మరియు జాతులు, వాతావరణాన్ని చూపించాడు దర్శకుడు. కథలోని థీమ్ ఆడియెన్స్ కు అర్ధం అయ్యాలా రూపొందించాడు దర్శకుడు అనూప్ భండారి. ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “కిచ్చా సుదీప్తో అనూప్ భండారి జోడీ కడుతున్నారని మొదట విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. విక్రాంత్ రోనా తెలుగులో విజయవంతమైంది. బిల్లా రంగ బాష కథ విన్నప్పుడు, ఇది మేమే నిర్మించాలి అనే నమ్మకం కలిగింది. సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్తో జతకట్టడం అనేది ఎప్పుడూ గొప్ప అవకాశం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది,బిల్లా రంగ బాష ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు ఎదురుచూస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈచిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషలలో నిర్మింస్తునన్నాం” అని అన్నారు.
BAADSHAH is here with the much awaited Pan Indian update💥💥
Proudly joining hands with Sensational VIKRANT RONA Combo, Baadshah @KicchaSudeep sir and Director @anupsbhandari to bring ‘A TALE FROM THE FUTURE’
for our next PAN INDIAN FILM 🔥#BillaRangaBaasha – First Blood ❤️🔥… pic.twitter.com/YnEm9ybBFj— Primeshow Entertainment (@Primeshowtweets) September 2, 2024
తాజావార్తలు
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో