“డ్రీమ్ గర్ల్” చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాతో నటించిన సహ నటి రింకు సింగ్ నికుంబ్ కోవిడ్ -19 సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. రింకు సింగ్ నికుంబ్ చివరిసారిగా ఆధార్ జైన్ “హలో చార్లీ”లో కనిపించారు. ఈ నటి గత కొన్ని రోజులుగా కోవిడ్ సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమెను ఆసుపత్రిలోని ఐసియులో చేర్చారు. మే 25న రింకుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉన్నారని, రింకు అనారోగ్యం పాలవ్వడంతో ఆమె తండ్రి ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో రింకును ఐసియుకు తరలించారు. రింకు ఆస్తమాతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం. మే 7న రింకు కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి మోతాదును తీసుకుందట. చిందుఘర్, మేరీ హనికరక్ బివి వంటి అనేక ప్రసిద్ధ ధారావాహికలలో రింకు సింగ్ నికుంబ్ నటించారు.