Avatar3 : అవతార్ 3 ని ప్రిపేర్ చేస్తున్న జేమ్స్ కెమెరూన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. అత్యాధునిక టెక్నాలజీతో అబ్బురపరిచే సన్నివేశాలు చిత్రీకరించటం వారికి మాత్రమే సాధ్యం. యాక్షన్, డ్రామా, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్లలో సినిమా తీయడం వారి తర్వాతే ఇంకెవరైనా. అలా హాలీవుడ్‌లో విజయకేతనం ఎగరేసిన చిత్రాలు ఇతర భాష చిత్రాలకూ స్ఫూర్తినిస్తుంటాయి. ఇందులో భాగంగా ‘ది టర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’, ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ వంటి భారీ చిత్రాలతో ఒక ప్రపంచాన్నే లోకానికి పరిచయం చేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ‘టైటానిక్’ తర్వాత ‘అవతార్’ ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా 2,923 బిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే ఒక స్టేట్ బడ్జెట్‌కు సరిపడా డబ్బులను కలెక్షన్ల రూపంలో సాధించిందనమట. ఇక ఇప్పటి వరకు అవతార్ ఫ్రాంచైజీ నుండి టూ ఫిల్మ్స్ రాగా, ఇప్పుడు థర్డ్ మూవీ రాబోతుంది.
Also Read: Prashanth Varma : ప్రశాంత్ వర్మ ‘మహాకాళీ’ లో ‘ఛావా’ విలన్ ?
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
రీసెంట్ గా సినీమాకాన్‌లో జరిగిన ఈవెంట్లో నటుడు యాక్ట్రెస్ జో సల్దానా ఈ విషయాన్ని రివీల్ చేశారు. మూవీ గురించి పలు విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే జేమ్స్ కెమెరాన్ రికార్డ్ వీడియోను కూడా ప్రదర్శించారు. ఇందులో ‘ప్రజెంట్ న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుగుతుంది. మరిన్ని నవీ క్లాన్స్ ఉండబోతున్నాయి. ‘అవతార్ 3’ లో కొత్త రోల్స్ ఉండబోతున్నాయి. అలాగే మునుపెన్నడూ చూడని పండోరాను చూడబోతున్నారు’ అని తెలిపారు. అంతేకాదు ఈ సినిమాకు మరో రెండు సీక్వెల్స్ కూడా తెరకెక్కబోతున్నారని టాక్. అవి 2029 లో, 2031 లో రాబోతున్నాయట. పంచ భూతాల కాన్సెప్ట్ తోనే జేమ్స్ కెమెరాన్ ఈ చిత్రాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నేల, నీరు, ఇప్పుడు నిప్పును తీసుకు వస్తున్నాడట. ఇక ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న అవతార్ 3.. క్రిస్మస్ బరిలో దిగితే కనుక.. డిసెంబర్ 15 తర్వాత రిజర్వ్ చేసుకున్న భారతీయ చిత్రాలు.. రిలీజ్ డేట్స్ మార్చుకోక తప్పదు.
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!