అతడు సినిమాలో బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ గుద్దే కామెడీ ఎపిసోడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆ సీన్ షూట్ చేసేప్పుడు పరిస్థితి మాత్రం బాలేదు. నిజానికి నెక్ట్స్‌డే బ్రహ్మానందం పొట్ట మీద మహేశ్ గుద్దే కామెడీ ఎపిసోడ్ షూట్ చేయాలి. సడన్‌గా త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్ అయ్యింది. హాస్పటల్‌లో అడ్మిట్ చేశారు. వైఫ్‌తో కలిసి తెల్లారేదాకా అక్కడే ఉన్నాడు త్రివిక్రమ్. రాత్రంతా నిద్ర లేదు. కానీ, షూటింగ్ ఆగకూడదు.
Also Read : Vijay Devarakonda : దారి తప్పుతున్న విజయ్ దేవరకొండ నిర్ణయాలు..
ఇంటికెళ్లి స్నానం చేసి డెరైక్ట్‌గా లొకేషన్‌కెళ్లి, ఆ కామెడీ ఎపిసోడ్ తీశారు. హాస్పిటల్ విషయం ఎవరికీ చెప్పలేదు. బాధంతా గుండెల్లో దాచుకుని, ఫుల్ ఫన్‌తో ఆ సీన్స్ తీసేశాడు త్రివిక్రమ్. అందుకే ఆ సీన్ వస్తే ఇప్పటికీ నవ్వుకుంటూనే ఉండిపోతారు జనం. అయితే అతడు సినిమా టీవీలో హిట్ అయినంత బాగా ఎందుకో థియేటర్లలో కాలేదు. ఇక మహేష్ పుట్టినరోజు సంధర్భంగా అతడు సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.