Aswani Dutt Not Watched Kalki 2898 AD Here is the Reason: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని అశ్వినిదత్ నిర్మించారు. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి వాళ్లు కీలక పాత్రలలో నటించగా రాజమౌళి, ఆర్జీవి, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి వాళ్ళు అతిథి పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ సినిమాని సినీ సెలెబ్రిటీలు మాత్రమే కాదు పొలిటికల్ సెలబ్రిటీలు సైతం చూసి అద్భుతంగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు.
Aswani Dutt: సెన్సిటివ్ సినిమాలు చేసే నాగి కల్కి చేయగలడని అందుకే నమ్మా
తాజాగా నాగార్జున, రజనీకాంత్ వంటి వాళ్లు కూడా ఈ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇంతకీ ఈ సినిమాని మాత్రం 600 కోట్లకు పైగా రూపాయలు వెచ్చించి నిర్మించిన అశ్వినీదత్ చూడలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తాను ఇంకా సినిమా కాపీ చూడలేదని అన్నారు. తనకు పది రోజుల క్రితం కంటి ఆపరేషన్ జరిగిందని, ఈ నేపథ్యంలోనే ఇంకా సినిమా చూడలేదని అన్నారు. మరో వారం రోజులపాటు స్క్రీన్ చూడకూడదన్నారు, ఆ తరువాత మాత్రమే సినిమా చూడగలనని అన్నారు. ఆ విషయంలో నాకంటే మీ మీడియా వాళ్ళు, ఇతర ప్రేక్షకులు అదృష్టవంతులు అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.