Site icon NTV Telugu

Asin : గజనీ సినిమా హీరోయిన్ ఆసిన్.. ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా?

Asin

Asin

ఆసిన్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆసిన్. సూర్యతో నటించిన గజినీ సినిమాతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుని ఆసిన్. తెలుగులో బాలయ్యతో లక్ష్మి నరసింహతో కారప్పొడిగా బాగా ఫెమస్ అయింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ కో ఫౌండర్ ని పెళ్లి చేసుకుంది ఆసిన్. కానీ ఆ తర్వాత సడన్ గా సినిమాలకు దూరం అయింది.

Also Read : Tharman : మరీ ఇంత అందంగా ఉన్నానేంట్రా.. తమన్ వీడియో వైరల్

పెళ్లి తర్వాత సినిమాలకే కాదు గ్లామర్ ఫిల్డ్ కే దూరంగా ఉంది. సినిమా ఫంక్షన్స్ కానీ యాడ్స్ కానీ ఎందులోనూ కనిపించలేదు ఆసిన్. భర్తతో కలిసి కూడా బయట కనిపించకుండా దాంపత్య జీవితం గడిపేస్తుంది. తాజాగా ఆమె పెళ్లి జరిగి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆసిన్ పెళ్లి ఫోటోలను షేర్ చేసాడు భర్త రాహుల్ శర్మ. దాంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రేండింగ్ అయింది ఆసిన్. నిన్న త్రిషా–నయనతారల వెకేషన్ ఫొటోస్ వైరల్ అవుతున్న అదే సమయంలో మరోవైపు హీరోయిన్ అసిన్ ఫోటో ఒక్కసారిగా ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఆమె తరం నటీమణుల్లో చాలామంది నటీమణులు స్వయంగా డబ్బింగ్ చెప్పలేని రోజుల్లో ఆసిన్ మాత్రం తాను నటించిన ప్రతి భాషలోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్  చేప్పేది.  అది ఆమెకు నటనపై, భాషలపై ఉన్న పట్టు. నటిగా తన కెరీర్‌ను కొనసాగించి ఉంటే, ఆల్‌టైమ్ స్టార్ గా నిలిచే స్థాయి ఆమెది అనడంలో  ఎలాంటి సందేహం లేదు. సినిమాలకు దూరమైనప్పటికీ కేవలం ఒక్క ఫొటోతో సోషల్ మీడియాలో అసిన్ పేరు మళ్లీ ట్రెండ్ అవుతూ అభిమానులను నోస్టాల్జియాలోకి తీసుకెళ్లింది.

Exit mobile version