ఆర్య… తమిళ సినీ పరిశ్రమలో ఒక మంచి నటుడు మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. కోలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఆర్య, ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్‌ను నిర్మించాడు. ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, మే 16న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం జీ5 OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఇది ఒకవైపు ఉంటే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్‌లోని సీ షెల్ హోటల్‌తో పాటు, ఆర్య యాజమాన్యంలో ఉన్నట్టు చెప్పుకునే వేలచ్చేరిలోని మరో ప్రాపర్టీపై ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు దాడులు చేశారని వార్తలు వచ్చాయి. ఈ రెస్టారెంట్‌లలో పన్ను ఎగవేత జరిగిందేమోనని అధికారులు తనిఖీ చేస్తున్నారట.
Also Read: Atharvaa: నాన్న మరణం.. చాలా భయానకం.. హీరో కీలక వ్యాఖ్యలు
ఈ విషయం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఆర్య హోటల్‌పై ఐటీ దాడులు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో, ఆర్య ఈ దాడులపై స్పందిస్తూ ఒక వివరణ ఇచ్చాడు. “ఐటీ అధికారులు దాడి చేసిన రెస్టారెంట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవి వేరే వ్యక్తులకు చెందినవి” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు కాస్త గందరగోళంలో పడేసేలా ఉన్నాయి. ఎందుకంటే, ఆర్య గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో సీ షెల్ హోటల్ తన సొంతమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు తనకు సంబంధం లేదని ఎందుకు చెబుతున్నాడని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, నిజం ఏంటంటే… ఆర్య నిజంగానే కొన్ని సంవత్సరాల క్రితం వరకు సీ షెల్ హోటల్‌ను నడిపాడు. కానీ, ఆ తర్వాత ఆ హోటల్‌ను వేరే వ్యక్తి కొనుగోలు చేశాడు. కున్హి మూసా అనే వ్యక్తి ఆర్య నుంచి ఈ హోటల్‌ను కొన్నాడని సమాచారం. అందుకే ఆర్య, ఇప్పుడు ఈ హోటల్‌తో తనకు లింక్ లేదని చెప్పుకొచ్చాడు.