సల్మాన్ ఆఫర్ ఇచ్చాడని మదరాసిని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు ఏఆర్ మురుగుదాస్. సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడి కష్టానికి ప్రతి ఫలం లేకుండా పోయింది. గెలుపు ఓటములు కామన్.. కాని సికిందర్ ప్లాప్‌కు రీజన్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటూ సరికొత్త భాష్యాలు చెబుతున్నాడు. సికిందర్ ప్లాప్‌కు తప్పు నాది కాదు.. లాంగ్వేజ్‌ది అంటున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్. సినిమా వచ్చిన నాలుగు నెలలకు.. బొమ్మ ఆల్ట్రా డిజాస్టర్‌కు రీజన్ భాషే అంటూ చక్కటి కవర్ డ్రైవ్ ఇస్తున్నాడు. ఈ హిట్ కొట్టినప్పుడు రాని లాంగ్వేజ్ బేరియర్స్.. బీటౌన్‌లో ఇలా ఫస్ట్ ప్లాప్ పడిందో లేదో తత్వం బోధపడిందని సెలవిస్తున్నాడు ఈ డైరెక్టర్. నార్త్ బెల్ట్‌లో హిట్ కొట్టేసినప్పుడు.. ఇలాంటి వంకలు చెప్పని మురుగుదాస్.. ఓ బొమ్మ బోల్తా పడే సరికి ట్వంగ్ ట్విస్ట్ చేస్తున్నాడు. శివకార్తీకేయన్‌తో తీస్తున్న మదరాసి ప్రమోషనల్లో భాగంగా సికిందర్ ప్లాప్ కథలు చెబుతున్నాడు మురుగుదాస్.
Also Read : Coolie Trailer Review: ఏమయ్యా లోకేషూ.. ఏంటిదీ ఇంత పని చేశావ్?
సల్మాన్ ఖాన్ పిలిచాడని.. మదరాసి షూటింగ్‌కు బ్రేకులిచ్చి మరీ సికిందర్ తీశాడు మురుగుదాస్. కానీ ఫలితం మరోలా తేలింది. అయితే గెలుపు ఓటములు సహజమేనని ఆయనకు తెలిసినప్పటికీ.. మాతృభాషలో సినిమా తీయడం స్టెంత్ అని.. తెలుగు కూడా మేనేజ్ చేయగలనని, హిందీ భాష గురించి ఏమీ తెలియదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తమిళంలో హిట్టైన బొమ్మలను తీసుకెళ్లి.. రీమేక్ చేసినంత ఈజీకాదు.. నయా సబ్జెక్ట్, స్క్రీన్ ప్లేతో బీటౌన్ ఆడియన్స్ భావోద్వేగాలు తెలియవంటున్నాడు. నాకు తెలియని భాషలో తెలియని ప్రాంతంలో మూవీ చేస్తుంటే హ్యాండికాప్డ్ ఫీలింగ్ కలిగిందని స్టేట్ మెంట్ పాస్ చేస్తున్నాడు మురుగా..
Also Read : War 2 Vs Coolie : వార్-2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ బాగుందంటే..?
మురుగుదాస్ స్టేట్ మెంట్స్ డీకోడ్ చేస్తున్నారు కొంత మంది సినీ లవర్స్. హిందీలో సికిందర్ ఆయన ఫస్ట్ మూవీ కాదు.. గజినీ, హాలీడే, అకీరాలతో సూపర్ హిట్స్ ఇచ్చాడు. అదే తెలుగు మేనేజ్ చేయగలను అని చెబుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్.. టాలీవుడ్‌లో చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్ తీశారు. కానీ రెండు బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొట్టాయి. మరీ వీటి సంగతేంటీ..అని ప్రశ్నిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మేకింగ్, టేకింగ్ అని చెప్పుకోకుండా లాంగ్వేజ్ ప్రాబ్లమని స్టార్ డైరెక్టర్ చెప్పడం విడ్డూరంగా చూస్తోంది కోలీవుడ్. మదరాసి హిట్టేతే ఓకే.. అదే తేడా కొడితే.. అప్పుడు భాష ప్రాబ్లమ్ చెప్పగలడా..? అప్పుడో ఇంకో కహానీ సిద్ధం చేస్తాడేమో చూద్దాం.