టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఎంతో పండుగ చేసుకుంటారు .టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోల చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి .రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ను తమ అభిమాన హీరో తరుపున మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తారు.ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతుంది.
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో విక్రమ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా హీరోయిన్ గా నటించింది .దర్శకుడు శంకర్ తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు..ఈ సినిమా అప్పట్లోనే భారీగా కలెక్షన్స్ సాధించింది.ఇదిలా ఉంటే ఈ సినిమాను 4k వెర్షన్ లో మే 17న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమాకి హ్యారిస్ జయరాజ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు..ఈ సినిమా పాటలు ఇప్పటికి ఎంతో పాపులర్ అని చెప్పవచ్చు.