యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్‌ల్లో మొదటి స్థానంలో ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. కానీ ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు జోరు తగ్గింది. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు ఎప్పుడో ఒక సినిమా చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో తో అలరించింది. ఈ చిత్రంలో గ్లామర్ బ్యూటీ గా కనిపించి ఒక్కసారిగా కుర్రాళ్లకు షాకిచ్చింది అనుపమ. మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన ఈ కేరళ కుట్టి ఈ మూవీతో గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఊహించని విధంగా లిప్ లాక్స్ తో రెచ్చిపోయి విమర్శలు ఎదుర్కొంది. ఇక రీసెంట్ గా ‘డ్రాగన్’ మూవీ తో అలరించిన ఈ కర్లీ బ్యూటీ, మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘పరదా’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: Urvashi Rautela : రికార్డ్ సాధించిన బాలయ్య బ్యూటీ..!
‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ చిత్రం ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే కథ. ఇందులో అనుపమ ‘సుబ్బు’ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్‌కి సూపర్ రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఏంటంటే ఈ ‘పరదా’ సినిమాలో గెస్ట్ రోల్‌ల్లో స్టార్ హీరోయిన్ సమంత కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్ లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. గతంలో అనుపమ, సమంత ‘అ ఆ’ మూవీలో కలిసి నటించారు. ఇందులో వీరిద్దరి కాంబో బాగా వర్కౌట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు కలిసి రాబోతున్నారు. ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.