Sasanasabha: ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ నుండి మరో పాన్ ఇండియా మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేజీఎఫ్, కేజీఎఫ్-2’ చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవి బసుర్. ఈ చిత్రాలకు రవి బసుర్ అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఇక ‘కేజీఎఫ్-2’ తరువాత రవి బసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం ‘శాసనసభ’. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటుడు డా. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని దీనిని నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నేపథ్య సంగీతం పనుల్లో సంగీత దర్శకుడు రవి బసుర్ బిజీగా వున్నారు.
Also Read

ఈ సినిమా విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ , ”పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా ఉంటాయి. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా వుంది. ‘శాసనసభ’ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్బుతంగా అవుట్‌పుట్ వచ్చింది. ‘కేజీఎఫ్-2’ తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది” అని అన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్న ఈ చిత్రానికి కథ, మాటలు రాఘవేందర్‌రెడ్డి అందించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!