Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!

Jagapathi Babu

Jagapathi Babu

జగపతి బాబుతో అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఉంటుందని పబ్లిక్‌గా ప్రకటించేశాడు అనిల్ రావిపూడి. జగపతి బాబు ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే. చాలా కాలం తర్వాత ‘వదల’ సినిమాతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సినిమాను ఎవరూ కొనకపోవడంతో, ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రేజ్ లేని హీరోను వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అనిల్ సినిమా ప్రకటించడం పెద్ద షాకే. ఒకప్పటి ఫ్యామిలీ హీరోతో సినిమా అనౌన్స్‌మెంట్ చేయడం వెనకాల అనిల్ ధైర్యం ఏంటో చూద్దాం.

వరుసగా రెండు 300 కోట్ల సినిమాలు, సంక్రాంతికి వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ తర్వాత అనిల్ రావిపూడి రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వెంకటేష్, కల్యాణ్ రామ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బాలయ్యతో మరో మూవీ ఉంటుందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇంతలో జగపతి బాబు తెరపైకి వచ్చేసాడు. జగపతి బాబు హీరోగా నటించిన ‘వదల’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన అనిల్.. హీరోతో జరిగిన సంఘటనను పంచుకున్నాడు. అనిల్ డైరెక్షన్‌లో కామెడీ సినిమా చేయాలన్న కోరికను జగపతి బాబు బయట పెట్టాడు. ‘వదల’ వేదిక సాక్షిగా.. త్వరలో తమ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఉంటుందని అనిల్ ప్రకటించాడు. అయితే నెక్స్ట్ మూవీ ఇదేనో, కాదో చెప్పలేదు.

జగపతి బాబు హీరోగా ఫేడ్ అవుట్ అయి చాలా కాలమైంది. స్టార్స్‌తో కంటిన్యూగా క్రేజీ ప్రాజెక్ట్స్ తీస్తున్న అనిల్.. ఉన్నట్టుండి హీరోగా ఇమేజ్ లేని జగపతి బాబుతో సినిమా ప్రకటించడం షాక్ ఇచ్చింది. కెరీర్ మొదట్లో కల్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, రవితేజతో సినిమాలు తీసి హిట్ కొట్టిన అనిల్.. ‘F2’ తర్వాత స్టార్స్‌ను మాత్రమే డైరెక్ట్ చేశాడు. సూపర్ స్టార్ మహేష్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ తీసి, హీరో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత బాలయ్యతో తీసిన ‘భగవంత్ కేసరి’ పేరు తీసుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్న సినిమాతో అనిల్ ఫస్ట్ టైమ్ 300 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవికి ‘మన శంకర వరప్రసాద్’ తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. కలిసి వచ్చిన వెంకీతో ఐదో సినిమా తీస్తున్నాడు. ‘పటాస్’తో తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కల్యాణ్ రామ్‌ని మరొకసారి హీరోగా తీసుకున్నాడు. ఇలా స్టార్స్‌ని డైరెక్ట్ చేస్తూ, మల్టీస్టారర్ మూవీస్ మాత్రమే చేస్తున్న అనిల్.. జగపతి బాబుతో మూవీ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జగపతి బాబుతో సినిమా ప్రకటించడం వెనకాల అనిల్ ఫార్ములా ఉండనే ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లో సినిమా తీయడం అనిల్‌కు చాలా ఈజీ. ఇది కూడా అదే జానర్ అని ఆల్రెడీ ఈవెంట్‌లో చెప్పేసాడు. అయితే ఈ మధ్యకాలంలో అనిల్ మల్టీస్టారర్ అనే కొత్త జానర్‌లో నడుస్తున్నాడు. ఈ లెక్కన జగపతి బాబుతో పాటు మరో హీరో ఉండడం ఖాయం. ‘F2’ నుంచి ఇద్దరు హీరోలతో మొదలు పెట్టి, ‘మన శంకర వరప్రసాద్’ లో ఇద్దరు సీనియర్ స్టార్స్‌ను కలిపాడు. ఇదే ఫార్ములాను ప్రస్తుతం వెంకీ, కల్యాణ్ రామ్ మూవీతో కంటిన్యూ చేస్తున్నాడు. కేవలం జగపతి బాబు అనే కాకుండా.. మరో హీరోతో కలిసి ఆల్రెడీ స్టోరీ లైన్ అనుకుని, అందుకే ఇంత కాన్ఫిడెన్స్‌తో అనౌన్స్ చేసేసాడు. మరి జగపతి బాబుతో కలిసి నటించేది సీనియర్ హీరోనా, స్టార్ హీరోనా.. అనిల్ విజన్‌లో ఎవరున్నారో మరి!