Anchor Suma Targeted in Rakhi Avenues Real Estate Fraud: పుట్టింది తెలుగు రాష్ట్రాల్లో కాదు అలా అని తెలుగు కుటుంబంలోనూ పుట్టలేదు. అయినా సరే ఇప్పుడు తెలుగు సినిమా ఈవెంట్ అన్నా మంచి తెలుగు షో అన్నా సరే యాంకర్ సుమ పేరు గుర్తు రావడం సర్వసాధారణమే. అంతే కాకుండా వివాదాలకు ఆమడ దూరంలో ఉంటూ క్లీన్ గా ఇమేజ్ తెచ్చుకున్న యాంకర్ సుమ ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకుంది. ఆమెకు సంబంధం లేకపోయినా ఇప్పుడు ఆమె ఈ వివాదంలో కేంద్ర బిందువుగా మారింది.
Guess the Celebrity: పవన్-రేణు దేశాయ్ పక్కన కూర్చున్న ఈ పాపను గుర్తు పట్టారా?
అసలు విషయం ఏమిటంటే రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థ మధ్యతరగతి కుటుంబాలకు 26 లక్షలకే సొంత ఇల్లు కట్టిస్తామని చెప్పి అందరి దగ్గర కలిపి 88 కోట్లు వసూలు చేసిందట. ఆ తర్వాత ఇప్పుడు బోర్డు తిప్పేసింది. దీంతో వారికి డబ్బులు కట్టిన వాళ్ళందరూ రోడ్ ఎక్కారు. తమకు న్యాయం చేయాలని పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. అంతే కాదు కొంతమంది ఈ సంస్థకు సుమ ప్రచారం చేయడం వల్ల ఇది మంచి సంస్థ అని కొన్నామని అయితే ఇప్పుడు సంస్థ బోర్డు తిప్పేసింది అని వాపోతున్నారు. ఈ యాడ్స్ లో సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా కనిపించారని, ప్రభుత్వాలతో పాటు సుమ కూడా ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.