Ananya Panday: అనన్య పాండేపై నెటిజన్ల ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ (Liger) సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday). తాజాగా ఆమె నటించిన ప్యూర్ కాలేజీ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’ (Chand Mera Dil) థియేటర్లలోకి వచ్చింది. గతేడాది ‘కిల్’ (Kill) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో లక్ష్య లాల్వాని ఇందులో హీరోగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా కథ మొత్తం మన హైదరాబాద్ (Hyderabad) నేపథ్యంలోనే సాగడం విశేషం. అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ వసూళ్ల కంటే కూడా ఈ సినిమాలోని ఒక డాన్స్ సీక్వెన్స్ కారణంగా అనన్య పాండే సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది.
వివేక్ సోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్ లొకేషన్స్, ఇక్కడి కల్చర్ చుట్టూ తిరిగే ఈ ప్రేమకథకు థియేటర్లలో యావరేజ్ టాక్ లభించింది. అయితే, సినిమాలో అనన్య పాండే చేసిన భరతనాట్యం సీన్‌కు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ వివాదానికి దారితీసింది.సినిమాలోని ఒక సన్నివేశంలో అనన్య పాండే సాంప్రదాయ భరతనాట్యం దుస్తులు ధరించి నృత్యం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ సీన్లో ఆమె చేసిన పర్ఫార్మెన్స్ తీవ్ర విమర్శలపాలవుతోంది. ఆమె ముఖంలో ఎలాంటి హావభావాలు (Expressions) లేకపోవడమే కాకుండా, ఆమె వేసిన స్టెప్పులు భరతనాట్యంలా కాకుండా విచిత్రమైన గెంతుల్లా ఉన్నాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
‘కనీసం బేసిక్స్ కూడా నేర్చుకోకుండా మన ప్రాచీన సాంప్రదాయ నృత్యకళను ఇలా నవ్వులపాలు చేయడం ఏంటి?’ అంటూ క్లాసికల్ డాన్సర్స్ నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో దారుణంగా మీమ్స్ వేస్తున్నారు. ఈ సీన్ సరిగ్గా రానించకపోవడంతో హీరోయిన్‌తో పాటు డైరెక్టర్ వివేక్ సోనిపై కూడా నెగటివిటీ వస్తోంది. ఇక ఈ చిత్రానికి మిశ్రమ స్పందన (Average Reviews) రావడంతో బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. సినిమా థియేటర్లలో కంటే, అనన్య పాండేను ట్రోల్ చేస్తున్న ఆ భరతనాట్యం డాన్స్ క్లిప్ వల్లే ఈ సినిమాకు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన అటెన్షన్ లభిస్తుండటం గమనార్హం.
తాజావార్తలు
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!