పుష్ప లాంటి వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్‌ల తర్వాత, ఇప్పుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముంబైలో నిశ్శబ్దంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
Read More: Puri – Sethupathi: అబ్బే ఆ హీరోయిన్లు సినిమాలో లేరట!
ఇప్పటికే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్‌లకు అవకాశం ఉందని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అందులో ముగ్గురు అల్లు అర్జున్ సరసన నటించనుండగా, మరో ఇద్దరు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ ఒక హీరోయిన్‌గా ఎంపికైంది, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అలాగే, దీపికా పదుకొణెను కూడా ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది, కానీ అది ఇంకా ఖరారు కాలేదు.
Read More:Pushpa 2: డిశ్చార్జ్ కానున్న సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీ తేజ్
తాజా సమాచారం ప్రకారం, డిజాస్టర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనన్యా పాండేను ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. అట్లీ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. సుమారు ₹600 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ మరియు అట్లీ కలిసి ₹250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అనేక వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.