టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏ సినిమా వేడుకలోనైనా సాధారణంగా కృతజ్ఞతలు చెప్పడం, సినిమా విశేషాలు పంచుకోవడం చూస్తుంటాం. కానీ, ఆనంద్ దేవరకొండ మాత్రం తన కెరీర్ ప్రారంభం నాటి కష్టాలను, తన వెనుక ఉన్న అసలు బలాలను ఓపెన్‌గా బయటపెడుతూ సంచలన నిజాలు వెల్లడించారు. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా పైకొచ్చానని చాలామంది అనుకుంటారు. కానీ, ఆనంద్ దేవరకొండ ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. “నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, ఎవ్రీథింగ్ నేనే ఒంటరిగా సాధించానని చెప్పడంలో నిజం లేదు” అంటూ కుండబద్దలు కొట్టారు. తనను ప్రతిక్షణం కాపాడుకుంటూ, వెన్నంటి నిలిచిన తన కుటుంబ సభ్యుల గురించి చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
తన జీవితంలో అమెరికా వెళ్లిన నాటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆనంద్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 2014లో ఉన్నత చదువుల కోసం పెద్ద పెద్ద లోన్లు తీసుకొని విదేశాలకు వెళ్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో తన కుటుంబం పడిన క్షోభను తలచుకున్నారు. ఆ సమయంలో తన అన్న విజయ్ దేవరకొండ ఎదుగుదల, తమ కుటుంబం పడిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ తన కళ్లముందు కదలాడుతున్నాయని చెప్పారు. తమ కుటుంబం ఎదుర్కొన్న ఆ జనరేషనల్ స్ట్రగుల్స్‌ను విజయ్ దేవరకొండ తన సక్సెస్‌తో పూర్తిగా మార్చేశాడని కొనియాడారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్’ (EPIC). వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి సెప్టెంబర్ 10నే ప్రీమియర్స్ వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాధారణ సినిమాలా హ్యాపీ ఎండింగ్‌తో కాకుండా, చాలా రియలిస్టిక్‌గా అన్ ఫినిష్డ్ స్టోరీలా ఈ మూవీ ఉంటుందని, యూత్ అందరూ దీనికి కనెక్ట్ అవుతారని ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఆనంద్ దేవరకొండ మాట్లాడిన ఈ ఎమోషనల్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

