పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. కొద్దీ రోజులుగా ఈ సినిమాను ఇప్పటికి ప్రకటించిన మర్చి 28న రిలీజ్ ఉండదని పోస్ట్ పోన్ అవుతుందని సోషల మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఆ వార్తలకు సంబంధించి చిత్ర నిర్మాత ఏఎం రత్నం తాజాగా క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా చెప్పినట్టు మార్చి 28నే థియేటర్లలోకి తీసుకువస్తామని, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని, ఎవరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తాం ఆ విషయంలో మరో మాట లేదు. పవన్ కల్యాణ్ కు సంబంధించి మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నాం” అని అన్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టిందిరో’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ పాట కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నిర్మాత మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెప్పి, అభిమానులను మరింత ఖుషీ చేశారు.