ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఆటహాసంగా జరిగింది. ఇందులో పలువురు భారతీయ నటీమణులు, హీరోలు పాల్గోనగా. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్, ఊర్వశి రౌతెలా, ప్రణీత సుభాష్.. ఇలా ఎందరో స్టార్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారు. అయితే లేటుగా వచ్చినా కేన్స్‌లో అదరగొట్టింది బాలీవుడ్ అందాల తార అలియా భట్. కలర్ ఫుల్ డ్రెస్సుల్లో రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ చూపు తన వైపు తిప్పుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అని సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి కూడా అలియా భట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారకాగా. ఈ క్రమంలో పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. ఇందులో భాగంగా ఒక దక్షిణ భారతీయ నటుడి గురించి అలియా మాట్లాడటం విశేషం..
Also Read : Tourist Family : ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇంతకీ ఎవరతను అనుకుంటున్నారా.. ‘పుష్ప 2’ విలన్ ఫహాద్ ఫాజిల్. ‘నిజంగా నేను ఆరాధించే నటుల్లో ఫహాద్ ఒకరు. ఆయన చాలా అద్భుతమైన నటుడు. ఆయన నటించిన చిత్రాల్లో ‘ఆవేశం’ నాకు చాలా ఇష్టం. కచ్చితంగా అవకాశం వస్తే అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే చిత్రపరిశ్రమలన్నీ ఒకే యూనిట్ అని కరోనా రోజుల్లో తెలుసుకున్నా’ అని అంది అలియా. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి..