పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్, ఇప్పుడు కథలు కాదు దర్శకులనే సెలెక్ట్ చేస్తున్నాడు అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’తో భారీ విజువల్ స్పెక్టాకిల్ కు సిద్ధమవుతున్న బన్నీ, ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ తో ఏఏ 23 చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాయి అనే అంచనాలు ఉన్నాయి. అంటే బన్నీ ఇప్పుడు ఒక్క సినిమా హిట్ కోసం కాదు, గ్లోబల్ బ్రాండ్ గా తన స్థానాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు అనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకే తరహా మాస్ సినిమాలతో ముందుకు వెళ్తాడా లేక ప్రతి సినిమాతో కొత్తగా కనిపించాలి అనుకుంటున్నాడా? అట్లీ కమర్షియల్ విజువల్స్, లోకేష్ రియలిస్టిక్ యాక్షన్, బాసిల్ జోసెఫ్ భావోద్వేగ కథనం, సందీప్ రెడ్డి వంగ ఇంటెన్స్ స్క్రీన్ ప్లే… నలుగురు దర్శకుల స్టైల్ పూర్తిగా వేరువేరు. అందుకే అల్లు అర్జున్ కూడా తన ఇమేజ్ ను ఒకే టెంప్లేట్ లో కాకుండా, నాలుగు భిన్నమైన కోణాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే వ్యూహంతో ఉన్నాడు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ భారీ అంచనాలు ఉన్న ఈ కాంబినేషన్లలో ఒక్క సినిమా తడబడినా, మొత్తం లైనప్ పైనే ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.
ఇంకో ఆసక్తికర అంశం… పుష్ప2 బ్లాక్ బస్టర్ తర్వాత పుష్ప3 చేయకుండా అట్లీ, లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టులపై ఇంకా చర్చలు కొనసాగుతూ ఉండడం, బాసిల్ జోసెఫ్ సినిమా పై బలమైన ప్రచారం జరగడం. అయితే ఈ ప్రాజెక్టుల షూటింగ్ ఎప్పుడు మొదలవుతాయి, ఏ సినిమా ముందుగా వస్తుంది అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. కానీ అభిమానుల్లో క్యూరియాసిటీ మాత్రం పెరుగుతోంది. మొత్తానికి పుష్ప తర్వాత అల్లు అర్జున్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే, ఆయన టాలీవుడ్ స్టార్ గా కాకుండా గ్లోబల్ మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకున్న ఇండియన్ స్టార్ గా తన కెరియర్ ను నిర్మించుకుంటున్నట్లు కనిపిస్తుంది.

