Allu Arjun: బన్నీ వదిలేసుకున్నవన్నీ హిట్లే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకులకి హ్యాండ్ ఇవ్వటంలో అల్లు అర్జున్ టాలీవుడ్ రణ్వీర్ అనిపించుకుంటున్నాడా? తన దగ్గరికి వచ్చేసరికి దర్శకులు ప్రూవ్ చేసుకొని ఉండాలా? ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుందా? అల్లు అర్జున్ వదిలేస్తే సినిమా హిట్టా? దర్శకులు ప్రూవ్ చేసుకుంటేనే, లేదంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాకైనా సరే దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు బన్నీ బాధితులే అనే విషయం అందరికీ తెలిసిందే. కరోనా బిఫోర్ వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే పట్టాలెక్కలేదు. కథ నచ్చకే బన్నీ క్విట్ అయ్యాడని టాక్. కొరటాల శివతో AA 21 అనౌన్స్ చేసిన బన్నీ, ‘ఆచార్య’ డిజాస్టర్ కావడంతో దర్శకుడిని పక్కన పెట్టి సుకుమార్ ని లైన్ లో పెట్టాడు. స్టైలిష్ స్టార్ కాదనడంతో తారక్ ను సెట్ చేసి ‘దేవర’తో హిట్ కొట్టాడు కొరటాల. వేణు, కొరటాల వర్కింగ్ స్టైల్ అలవాటు లేదు కాబట్టి బన్నీ తిరస్కరించాడు అనుకోవచ్చు. కానీ, అతని ఖాతాలో త్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హ్యాండ్ ఇచ్చాడు బన్నీ.
‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అలా వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత గురూజీతో ఫోర్త్ మూవీకి కమిట్ అయ్యాడు ఐకాన్ స్టార్. అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. మైథాలజీ మూవీ చేయాలనుకున్నాడు త్రివిక్రమ్. కానీ, ‘గుంటూరు కారం’ ఆశించిన విజయం సాధించకపోవడం, ‘పుష్ప’ చిత్రాలతో అల్లు అర్జున్ రేంజ్ పెరగడంతో, పాన్ ఇండియా అనుభవం లేదన్న కారణంగా గురూజీని బన్నీ పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ ఎట్టకేలకు తారక్ చెంతకు చేరింది. రీసెంట్ గా అనౌన్స్ చేశారు. బన్నీ ఇవే కాదు, గతంలో చాలా హిట్ సినిమాలు వదిలేసుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘బొమ్మరిల్లు’, ‘100% లవ్’, ‘టెంపర్’ కథలు ఫస్ట్ బన్నీ దగ్గరికి వెళ్ళినవే. బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాలు చేయలేకపోయాడు. బన్నీ వదిలేసుకున్న ఈ సినిమాలన్నీ హిట్స్ పడడంతో, ‘గాడ్ ఆఫ్ వార్’ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇప్పటి నుండే ఫిక్స్ అయిపోతున్నారు తారక్ ఫ్యాన్స్. మరి ఈ ఎస్టిమేషన్స్ ఎంతవరకు కరెక్టో తేలాలంటే, ఇంకొన్నేళ్ళు ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!