అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో హైదరాబాద్‌లో భారీ ఎత్తున సమావేశమైంది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఫ్యాన్స్ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అధ్యక్షుడు శివ శంకర్, తెలంగాణ అధ్యక్షుడు అంజి యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌లో జిల్లా, మండల, పట్టణ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలని నిర్ణయించారు.
Also Read : Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!
అభిమానం అంటే కేవలం థియేటర్ల దగ్గర హడావుడి చేయడమే కాదు, సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేయాలని నిర్ణయించిన ఫ్యాన్స్.. ‘ప్రతి సంవత్సరం ఒక మంచి పని’ అనే నినాదాన్ని తీసుకున్నారు. బన్నీ విలువలు, క్రమశిక్షణను ప్రతిబింబించేలా సేవా కార్యక్రమాలను కిందిస్థాయిలోకి తీసుకెళ్లడమే ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం. బాధ్యతాయుతమైన అభిమాన సంఘంగా ఎదగాలని, ఐక్యతతో ముందుకు సాగాలని ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
