మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు మనం చాలా కాలం నుంచి వింటూనే వస్తున్నాం. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోవడంతో నిజంగానే వారి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని వారు నేరుగా ఖండించకపోయినా తమ మధ్య ఎంత మంచి బంధం ఉందో అనే విషయాన్ని మాత్రం బయట పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగానే షోలో భాగంగా ఒక్కొక్క ఫోటో ప్లే చేస్తూ వారి గురించి మీ అభిప్రాయం చెప్పాలని అడుగుతారు.
Allu Arjun : నేషనల్ అవార్డుపై అల్లు అర్జున్ కామెంట్స్.. మరో మెట్టు ఎక్కేశావ్ బాసూ!
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి, మీ అభిప్రాయం చెప్పమని అడిగితే దానికి అల్లు అర్జున్ నవ్వుతూ కళ్యాణ్ గారి ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సొసైటీలో చాలామంది హీరోలని, బిజినెస్ పీపుల్ ని నేను చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటాను. కానీ నేను లైవ్ లో దగ్గర్నుంచి చూసి ధైర్యవంతులలో ఆయన ముందుంటారు. ఆయన ధైర్యాన్ని నేను బాగా ఇష్టపడతాను, ఆయన వెరీ డేరింగ్ పర్సన్ నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో వెరీ డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు. దానికి బాలకృష్ణ తన దారిలో తాను వెళ్ళిపోతాడు అంటే అంతే అని అల్లు అర్జున్ తల ఊపారు. సేమ్ మీలాగే అని అనడంతో బాలకృష్ణ కూడా నవ్వుతూ అవును నిజమే అని అంటూ అన్నారు. ఇక గతంలో అల్లు అర్జున్ జై పవర్ స్టార్ అని అనమంటే దానికి చెప్పను బ్రదర్ అని అనడంతో ఒక పెద్ద వివాదం రేగింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోని ధైర్యం తనకు ఇష్టమని ఆయన అనడం గమనార్హం.
mama entha daring oo alludu anthe daring🫂#PawanKalyan #AlluArjun 🩷🩷#UnstoppableWithNBK #Pushpa2TheRule pic.twitter.com/bGyj6tmJ94
— Jaanu (@iudrinkcoffee) November 14, 2024