హాస్య చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది హీరోలలో అల్లరి నరేష్ ముందు వరసులో ఉంటారు. ఒకానొక టైమ్ లో ఏడాదికి ఏడు, ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసాడు. కానీ ఇప్పుడు అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కామెడీ కథలను పక్కన బెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఆ కోవలోవే నాంది, ఉగ్రం, బచ్చలమల్లి సినిమాలతో అలరించాడు.
Also Read : Siddharth : యంగ్ హీరో యాటిట్యూట్ తో దర్శకులకు తలనొప్పి
ఇప్పటి వరకు 62 సినిమాలలో నటించిన అల్లరి నరేష్ తన నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు. ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో అల్లరి నరేష్ ఆల్కహాల్ లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ చూస్తే అల్లరి నరేష్ నుండి మరో కొత్త కంటెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజిగా ఉంది. అల్లరి నరేష్ సరసన రుహాణి శర్మ కథానాయకిగా నటిస్తోందడగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.