హాస్య చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది హీరోలలో అల్లరి నరేష్ ముందు వరసులో ఉంటారు. ఒకానొక టైమ్ లో ఏడాదికి ఏడు, ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసాడు. కానీ ఇప్పుడు అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కామెడీ కథలను పక్కన బెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఆ కోవలోవే నాంది, ఉగ్రం, బచ్చలమల్లి సినిమాలతో…
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ప్రారంభించాడు. ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్…