Alia Bhatt First Time Singing Song in Telugu: నటనకే కాదు తన గొంతుతో అందరిని ఆకర్షించింది ఆలియా.. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొని అందరి దృష్టిని ఆమెవైపు మళ్లించుకుంది. ఇంత వరకు ఆలియా హిందీ సాంగ్స్ పాడి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆమె గొంతుతో అందరిని మైమరిపిస్తుంది. అలాంటి ఆలియా తెలుగులో సాంగ్ పాడితే ఇక టాలీవుడ్ ప్రేక్షకులు ఉండగలరా ఈవెంట్‌లో విజిల్స్, ఆలియా సూపర్ అంటూ కేకలతో హోరిత్తించారు.
“ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే..
తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే..
అందాల నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా ..
అంటూ చిటికేస్తూ ఆలియా పాడుతుంటే రన్ బీర్ కపూర్ కల్లల్లో ఆనందం తన మొఖంలో చిరునవ్వు కనిపించాయి. స్టేజ్ పైన వుండేవారు కూడా ఆలియా భట్ పాటను ఆనందంగా ఆస్వాదిస్తూ చప్పట్లు కొడుతూ ఆలియాను ప్రోత్సాహించారు. అనంతరం ఆలియా హైదరాబాద్‌లో జరిగిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. జూ.ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆర్ఆర్ఆర్ లో నన్ను హీరోయిన్‌గా తీసుకున్నందుకు రాజమౌళిగారికి థాంక్స్. ఆయన సినిమా హీరోయిన్ అని చెప్పుకోవటం సంతోషంగా ఉంటుంది. అలాగే బ్రహ్మాస్త్ర సినిమా విషయానికి వస్తే ఆయనే హీరో. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా ప్రయాణం అసంపూర్ణంగా ఉండేది. ఆయన ఈ సినిమా కోసం ముందుండి మమ్మల్ని నడిపించారు. తారక్ మెగా మెగాస్టార్.. తను ఈవెంట్‌కు రావటం వల్ల మెగా హార్ట్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. నేను చూసిన వ్యక్తుల్లో తను గొప్ప మనసున్న వ్యక్తి. నాగార్జునని అందరూ కింగ్ అని అంటుంటారు. నిజంగానే ఆయన సెట్స్‌లోనే కాదు.. మా మనసుల్లోనూ కింగే. ఆయనతో కలిసి పని చేయటం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్ అన్నారు ఆలియా.