Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshara Haasan: స్టార్ హీరోల వారసులు అంటే పుట్టుకతోనే వెండితెర అవకాశాలు, సులువైన విజయాలు ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఆ అంచనాలు అందరి విషయంలో నిజం కావని నిరూపిస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె, నటి అక్షర హాసన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రయాణం పూలబాటలా ఉండదని స్పష్టం చేస్తూ, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన చదువు, అపజయాలు, కెరీర్ ఎదుగుదలపై ఎవరూ ఊహించని షాకింగ్ నిజాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువు విషయంలో తాను ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్‌ను ఏమాత్రం దాచకుండా అక్షర ఓపెన్‌గా వెల్లడించారు. హైస్కూల్ చదువుల్లో తాను తీవ్రంగా వెనుకబడ్డానని, పదో తరగతి పరీక్షల్లో ఏకంగా మూడుసార్లు ఫెయిలయ్యానని చెప్పారు. వరుసగా మూడేళ్లు తప్పడంతో చదువుపై ఆసక్తి పూర్తిగా పోయిందని, ఇక పరీక్షలు పాస్ కావడం తనవల్ల కాదని గ్రహించి చదువుకు శాశ్వతంగా స్వస్తి పలికినట్లు చెప్పారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, నచ్చిన రంగంలో రాణించే స్వేచ్ఛను ఇచ్చారని కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు.
స్టార్ కిడ్స్ అయినా ఇంట్లో ప్రశంసల కంటే విమర్శలే సూటిగా ఉంటాయని అక్షర చెప్పుకొచ్చారు. తెరపై తన నటన బాగోలేకపోతే తల్లిదండ్రులు మొహం మీదే నిక్కచ్చిగా మాట్లాడతారని, “చాలా చెత్తగా నటించావు” అని నిర్మొహమాటంగా చెబుతారని వెల్లడించారు. ఆ నిజాన్ని అంగీకరించి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే వాతావరణం ఇంట్లో ఉండటం వల్లే తాను గ్రౌండెడ్‌గా ఉండగలుగుతున్నానని పేర్కొన్నారు. చాలామంది స్టార్ కిడ్స్ లాగా అక్షర నేరుగా హీరోయిన్గా మారలేదు. ఫస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి, మ్యూజిక్ వీడియోలకు పనిచేశారు. ఆ తర్వాత రాహుల్ ధోలాకియా చిత్రం ‘సొసైటీ’, కమల్ హాసన్ ‘శభాష్ నాయుడు’ ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి కెమెరా వెనుక కష్టాన్ని అనుభవించారు. అమితాబ్ బచ్చన్, ధనుష్ నటించిన ‘షమితాభ్’తో అనూహ్యంగా హీరోయిన్గా పరిచయమై, ఆ తర్వాత అజిత్‌తో ‘వివేగం’, ఇటీవల ‘సిమ్యులాక్రా’ చిత్రాల్లో నటించినప్పటికీ.. తన అసలు కల మాత్రం దర్శకత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే తన సోదరి శృతి హాసన్ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను మాత్రం భవిష్యత్తులో నటన కంటే పూర్తిస్థాయి దర్శకురాలిగా మెగాఫోన్ పట్టి సరికొత్త కథలతో రాబోతున్నట్లు అక్షర హాసన్ ప్రకటించారు.
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
తాజావార్తలు
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!