Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవానికి మోడీ శుభాకాంక్షలు.. 2023 జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ప్రధాని
- కోటి దీపోత్సవానికి ప్రధాని మోదీ ప్రత్యేక అభినందన లేఖ
- 2023లో పాల్గొన్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రధాని
- భక్తులకు ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా పంపిణీ
- 17 రోజుల పాటు ప్రత్యేక పూజలు.. ప్రముఖ పీఠాధిపతుల రాక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. భక్తుల మదిలో ఆధ్యాత్మిక భావనలతో పాటు మెదిలే అతిపెద్ద మహోత్సవం భక్తి టీవీ నిర్వహించే ‘కోటి దీపోత్సవం’. పుష్కర కాలానికి పైగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల హృదయాల్లో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ మహా దీపయజ్ఞం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా మరోసారి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవంబర్ 14 నుంచి 30 వరకు జరగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుక విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అభినందన లేఖ పంపడం ఈ ఉత్సవ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది.
ప్రధాని మోడీ ప్రశంసల జల్లు.. 2023 జ్ఞాపకాలు
కోటి దీపోత్సవం-2026 ప్రారంభ వేళ రచన టెలివిజన్ సంస్థకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా లేఖ రాశారు. భారతీయ సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ చేస్తున్న అవిరళ కృషిని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా 2023 కోటి దీపోత్సవంలో తాను స్వయంగా పాల్గొని దీపారాధన చేసిన మధుర క్షణాలను మోడీ మరోసారి గుర్తుచేసుకున్నారు. నాడు ఈ వేదికపైకి విచ్చేసిన ప్రధాని.. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూసి తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న అనుభూతి కలుగుతోందని కొనియాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ వేడుకలో పాల్గొని, ఇలాంటి మహా యజ్ఞంలో పాలుపంచుకోవడం తన అదృష్టమని పేర్కొనడం కోటి దీపోత్సవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టాలు.
Also Read
- Garuda Purana: గరుడ పురాణం అంటే కేవలం చావు గురించేనా?.. అదొక అద్భుతమైన జీవిత పాఠశాల
- Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
- Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
- Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
ఒకే వేదికపై ముక్కోటి దేవతల దర్శనం.. భక్తులకు సర్వం ఉచితం
రచన టెలివిజన్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల గొప్ప సంకల్పంతో 2012లో శృంగేరి జగద్గురువుల సమక్షంలో మొదలైన ఈ దీపయజ్ఞం నేడు మహా వృక్షమై ఆధ్యాత్మిక వెలుగులు పంచుతోంది. ఒక దీపం వెలిగిస్తే మనలో పాజిటివిటీ నిండుతుందని, కోటి దీపాలు వెలిగిస్తే అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానకాంతిని ప్రసాదిస్తుందని రచన ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రచన వివరించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భక్తుల నుంచి ఒక్క రూపాయి రుసుము గానీ, కానుకలు గానీ తీసుకోకుండా.. ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, పూజా సామగ్రిని నిర్వాహకులే ఉచితంగా అందిస్తుండటం విశేషం.
కైలాసాన్ని తలపించే వేదిక.. పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు
ఎన్టీఆర్ స్టేడియంలో కైలాసాన్ని తలపించేలా తీర్చిదిద్దిన సభావేదికపైకి వస్తే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచభూతలింగాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాల నుంచి తరలివచ్చే ఉత్సవమూర్తులకు ఇక్కడ నిత్యం కన్నులపండువగా కల్యాణోత్సవాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా శృంగేరి, కంచి, మైసూరు దత్తపీఠం వంటి దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, జగద్గురువులు ఈ వేడుకకు విచ్చేసి భక్తులకు తమ అనుగ్రహ భాషణాలతో జ్ఞానబోధ చేయనున్నారు. భక్తిపారవశ్యంతో సాగే ఈ 17 రోజుల మహా దీపయజ్ఞం ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మిక కాంతులను నింపనుంది.
తాజావార్తలు
-
Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవానికి మోడీ శుభాకాంక్షలు.. 2023 జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ప్రధాని
-
Ukraine Peace Deal: డాన్బాస్ కావాలా.. NATO సభ్యత్వమా? ఉక్రెయిన్ ముందు అమెరికా ప్రతిపాదన!
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Garuda Purana: గరుడ పురాణం అంటే కేవలం చావు గురించేనా?.. అదొక అద్భుతమైన జీవిత పాఠశాల
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!