Akkineni Nagarjuna: సీఎం చంద్రబాబుతో అక్కినేని నాగార్జున భేటీ.. విషయం ఏంటంటే?
- సీఎం చంద్రబాబుతో అక్కినేని నాగార్జున భేటీ..
- తన కుమారుడు అక్కినేని అఖిల్ వివాహానికి రావాలంటూ ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు సినీ హీరో అక్కినేని నాగార్జున.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాగార్జున.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. తన చిన్నకుమారుడు అక్కినేని అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు అందజేసిన నాగార్జున.. తన కుమారుడి పెళ్లి రావాలంటూ ఆహ్వానించారు..
Read Also: West Bengal: మేనల్లుడిని చంపిన అత్త.. అసలు కథేంటంటే..!
Also Read
కాగా, గతేడాది అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య – శోభితా వివాహ బంధంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు.. ఇప్పటికే ప్రముఖ బిజినెస్మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో గతేడాది నవంబర్ 26వ తేదీన అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేశారు.. ఇక, ఈ నెల 6వ తేదీన అక్కినేని అఖిల్ – జైనబ్ వివాహం నిర్వహించబోతున్నారు.. జైనబ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి.. కొన్ని ఏళ్లుగా అఖిల్‌తో ప్రేమలో ఉన్నారు.. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులను కలిసి అక్కినేని నాగార్జున ఆహ్వానించిన విషయం విదితమే.. ఇక, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ – జైనబ్ వివాహం జరగనున్నట్టుగా తెలుస్తుండగా.. ఆ తర్వాత రాజస్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారని సమాచారం..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!