Lenin : లెనిన్’తో నాలుగు డబ్బింగ్ సినిమాల పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏజెంట్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని లెనిన్ గా వస్తున్నాడు అఖిల్. పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్ వదిలేసుకున్నాడు. మే 1న విడుదల కావలసిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా జూన్ 26 కు పోస్ట్‌పోన్ చేసుకుంది. కానీ అక్కడి నుండి కూడా తప్పుకొని జూలై 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కానీ సోలోగా వచ్చే సీన్ లేదు, నాలుగైదు సినిమాలతో పోటీ పడాల్సి వస్తోంది ఈ మూవీ.
సలార్ తో వరదరాజ్ మన్నార్ గా రిజిస్టర్ అయిన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ‘ఐ నో బడీ’ మూవీతో శుక్రవారమే థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. శ్రీ శ్రవంతి మూవీస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. కోలీవుడ్ హీరో అధర్వ మురళి కూడా టాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. తన ‘ఇదయం మురళి’ని ‘హృదయం మురళీ’గా ఇక్కడి ఆడియన్స్ ముందుకు తెస్తున్నాడు. కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అలాగే ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా, తెలుగు యూట్యూబర్ నాగదుర్గ డెబ్యూ ఫిలిం ‘లవ్ ఓ లవ్’ జూలై 10న రిలీజ్ కాబోతుంది. అలానే మాస్టర్ మహేంద్రన్ వసుదేవ సుతం కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది.
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
లెనిన్ ట్రైలర్, టీజర్, తమన్ ఇచ్చిన సాంగ్స్ ఇంప్రెసివ్ గా అనిపించినప్పటికీ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆడియన్స్ కు రీచ్ అయ్యేది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఎన్ని డబ్బింగ్ సినిమాలు వచ్చినా వాటిని బీట్ చేయగలదు. మరి లెనిన్ తో అఖిల్ ఓల్డ్ ఫ్లాప్ లెక్కలు సరిచేస్తాడా? కెరీర్ బిగినింగ్ నుండి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న భాగ్యశ్రీ బోర్సే ఖాతాలో ఓ హిట్ పడుతుందా లేదా అనేది ఈ శుక్రవారమే తేలిపోనుంది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!