Lenin : జపాన్’లో అక్కినేని ‘లెనిన్’

Lenin Movie Japan

Lenin Movie Japan

Lenin Movie : ఇటీవల తెలుగు సినిమాలకు జపాన్ లో మంచి ఆదరణ లభిస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో రిలీజ్ అయిన స్టార్ హీరోలు సినిమాలన్నీ కూడా జపాన్ లో రిలీజ్ అవుతూ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటుగా అక్కడ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలల్లో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. ఇప్పుడు మరొక తెలుగు సినిమా జపాన్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.

ఆ మూవీ గురించి కాస్త వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘లెనిన్ ‘ మూవీ జపాన్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా అఖిల్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. అంతేకాదు 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా జపాన్ ఆడియెన్స్ ని అలరించేందుకు సిద్ధం అయ్యింది.. ఈ ఏడాది డిసెంబర్ 11 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించారు. తెలుగులో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా జపాన్ లో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది..? అలాగే కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ అవుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అఖిల్ సినిమాల విషయాలనికొస్తే.. ప్రస్తుతం భారీ యాక్షన్ సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది.. త్వరలోనే ఆ సినిమాలను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం..