నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. సయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ తో పాటు ఫస్ట్ సింగిల్ జాజికాయ జాజికాయ భారీ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది.
Also Read : Jr NTR : దేవర 2 విషయంలో ఎం జరుగుతుంది.. అసలు వాస్తవం ఏంటంటే?
అఖండ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జర్మనీలో బాలయ్య ఫ్యాన్స్ సంచలనానికి తెరలేపారు. అఖండ 2 ను జర్మనీలో తారకరామ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సంస్థ అద్వర్యంలో అఖండ 2 టికెట్ ను వేలం నిర్వహించారు. ఎంతో మంది పోటీ పడిన ఈ వేలంలో అత్యంత ఎక్కువ ధరకు బిడ్ వేసి, ఇప్పటి దాకా ఏ సీనియర్ హీరోకి లేని అతి పెద్ద ఆఫర్‌తో బాలయ్యకు కొత్త రికార్డు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అభిమాని ఏకంగా రూ. 2 లక్షలకు అఖండ 2 టికెట్ ను దక్కించుకున్నాడు. అఖండ తాండవం ఎలా ఉండబోతుందో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని టికెట్ కొనుగోలు చేసిన అభిమాని తెలిపారు.