నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ 2 : తాండవం” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా బాలయ్య మరియు బోయపాటి కాంబో మరోసారి మాస్ మంత్రం వేసేలా ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌పై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
Also Read : Kaantha : ‘కాంత’ మూవీ గురించి.. సర్ప్రైజ్ రివీల్ చేసిన రానా..
రేపు నవంబర్ 14న సాయంత్రం 5 గంటలకు పీవీఆర్ జుహూ (ముంబై) లో ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌తోనే ‘అఖండ 2’ ప్రమోషన్స్ పాన్ ఇండియా లెవెల్లో ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, బాలయ్య మాస్ ఎనర్జీకి తగినట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఉండబోతున్నాయని టాక్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో “తాండవం మొదలైంది” అంటూ ట్రెండ్ మొదలు పెట్టేశారు.