Site icon NTV Telugu

Boyapati Srinu : నన్ను చూసి అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు!

Boyapati Srinu Dandam

Boyapati Srinu Dandam

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విజయ విశేషాలను, ప్రేక్షకుల స్పందనను పంచుకున్నారు.

Also Read :Akhanda 2: నేనూ మనిషినే నాకూ కోపం వస్తుంది.. అన్నీ బాలయ్యే చేశారు!

థియేటర్స్ విజిట్‌కు వెళ్లినప్పుడు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనే ప్రశ్నకు బోయపాటి భావోద్వేగంతో సమాధానమిచ్చారు.”ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఒక మంచి సినిమా తీసి ఆశించాల్సింది డబ్బు కాదు, గౌరవం. అలాంటి గౌరవం ఈ సినిమాకు దక్కింది. సహజంగా థియేటర్స్ విజిట్‌కు వెళ్లినప్పుడు అందరూ నిలబడి విజిల్స్, క్లాప్స్ కొడతారు. కానీ, ఈ సినిమాకి వెళ్లినప్పుడు అందరూ లేచి చేతులెత్తి దండం పెట్టారు. నేను కూడా ‘మీ అందరి స్పందన చూడడానికే వచ్చానని’ అందరికీ నమస్కరించి వచ్చాను. నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి.” ప్రేక్షకులు తమ సినిమాను కేవలం వినోదంగా కాకుండా, గౌరవంతో స్వీకరించడం ఆయనను ఎంతగానో సంతోషపరిచిందని బోయపాటి వెల్లడించారు.

Also Read :45 The Movie: అంచనాలు పెంచేసిన శివ రాజ్‌కుమార్ ’45 ది మూవీ’ ట్రైలర్

ఈ సినిమాతో దర్శకుడిగా మీరు ఒక కొత్త ఏరియాలోకి ఎంటర్ అయినట్టుగా అనిపించిందా అనే ప్రశ్నకు బోయపాటి స్పందిస్తూ… “కొత్త పాత అని కాదు గాని, ఇదంతా మనలో మమేకమై ఉన్నది. మన ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి అద్భుతంగా చెప్పాము. మన ధర్మాన్ని మనం ఫాలో అయితే అద్భుతంగా ఉంటామని చెప్పాము. థియేటర్స్‌లో చిన్న పిల్లలు ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళ కేరింతలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది,” అని అన్నారు. ఈ విధంగా ‘అఖండ 2: ది తాండవం’ కేవలం యాక్షన్ సినిమాగా కాకుండా, సాంస్కృతిక, ధార్మిక అంశాలను కూడా ప్రేక్షకులకు చేరువ చేయడంలో విజయం సాధించిందని బోయపాటి శ్రీను స్పష్టం చేశారు.

Exit mobile version