ఒక రవితేజ మొదలు ఒక రామ్ పోతినేని వరకూ … తన హీరోలు చాలా మందికి బ్లాక్ బస్టర్స్ అందించాడు పూరీ జగన్నాథ్. కానీ, అదేంటో ఏమో… ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నిలబడలేకపోయాడు. తరువాత ఎంట్రీ ఇచ్చిన పూరీ తనయుడు ఆకాశ్ కూడా ఇంత వరకూ హిట్ అందుకోలేదు. అయితే, ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
పేరే ‘రొమాంటిక్’ అంటూ పెట్టేశారు ఫిల్మ్ మేకర్స్. హీరో ఆకాశ్ పూరీకి ఈ సారి సక్సెస్ గ్యారెంటీ అన్నట్టుగా కనిపిస్తున్నాయి ‘రొమాంటిక్’ మూవీ ఫోటోలు, పోస్టర్లు. అయితే, ఎప్పుడో విడుదల కావాల్సిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ కరోనా లాక్ డౌన్స్ వల్ల డిలే అవుతోంది. కానీ, ఆలస్యమైనా కూడా ‘రొమాంటిక్’ క్రేజ్ తగ్గటం లేదు. ఇదే విషయాన్ని నిరూపించే ఓ పోస్ట్ ని పూరీకనెక్ట్స్ సంస్థ అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు!
సినిమాల విషయంలో చాలా మంది ఫాలో అయ్యే అంతర్జాతీయ వెబ్ సైట్ ‘ఐఎండీబీ’ ఓ లిస్ట్ ప్రకటించింది. ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ అండ్ షోస్’ అంటూ చిట్టా విప్పింది. అందులో రెండో ప్లేసులో ఉంది ఆకాశ్ పూరీ స్టారర్ ‘రొమాంటిక్’! చూడాలి మరి, టాప్ టెన్ లో సెకండ్ ర్యాంక్ సాధించిన అప్ కమింగ్ మూవీ ఎప్పుడు వస్తుందో! బాక్సాఫీస్ వద్దకొచ్చాక ‘రొమాంటిక్’ ఎలాంటి ఫలితం పొందుతుందో! ఆకాశ్ పూరీకి మాత్రం ఇప్పుడొక హిట్ మూవీ అర్జెంట్ గా అవసరం…