నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా ‘అఖండ 2’. గతంలో వచ్చిన ‘అఖండ’ ఎలాంటి సూపర్ హిట్‌గా నిలిచిందో చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా ‘అఖండ 2’ కథ ఉంటుందని తెలుస్తోంది. అలాగే మొదటి పార్ట్‌లోకి కొన్ని పాత్రలు రిపీట్ కాబోతున్నాయి, ఇక సీక్వెల్‌లోనూ బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం విశేషం.
Also Read : Malavika : అనుకున్నా గౌరవం దక్కింది..
అయితే షూటింగ్ తోందరగానే మొదలైనప్పటికి.. బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి అఖండ 2 సినిమా ముగింపు దశకు చేరుకుంది. కానీ విడుదల విషయంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి సమయం ఎక్కువ పడుతున్న కారణంగా, విడుదల వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేస్తునట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఈ 2026 సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ ఉన్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి సినిమా రంగంలోకి దిగబోతుంది, చిరంజీవి- అనిల్ రావిపూడి కూడా అప్పుడే దిగుతున్నారు. అందుకే ఈ సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా, ముందుగానే తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తూన్నారట. అందులో భాగంగానే దసరా మిస్ అయితే క్రిస్మస్‌కి అఖండ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా, ప్లాన్ చేస్తున్నారు అంటూ, ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీని అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.