దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వల్ల ఈ చిత్రం షూటింగ్ కు ఇప్పటికే అడ్డంకులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో 2021 అక్టోబర్ 13 న సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ ఆలస్యం కానుందని అంటున్నారు.
Also Read : బీచ్ లో కుర్రాడితో జాన్వీ… ఎవరబ్బా ?
73వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారే కాబట్టి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇది సరైన తేదీ అని మేకర్స్ అనుకుంటున్నారట. అంతేకాదు ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న “ఆర్‌ఆర్‌ఆర్” బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.