టాలీవుడ్‌లో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వరుస విజయాలను అందించిన శేష్, ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. మొదటి నుండి తన ప్రతి సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో అడివిశేష్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. ప్రస్తుతం ‘డెకాయిట్’, ‘G2’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేష్, ఈసారి యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ ప్యాక్డ్ మూవీస్‌తో వస్తున్నాడు.
Also Read : Mega Star : వింటేజ్ లుక్ లో మెగాస్టార్.. ఫొటోస్ వైరల్
హిట్, ద సెకండ్ కేస్ సక్సెస్ తర్వాత కేర్ ఫుల్‌గా స్టెప్స్ వేస్తున్నాడు అడివి శేష్. ప్రస్తుతం గూడఛారి సీక్వెల్ గూడఛారి2, డెకాయిట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండూ స్పై థ్రిల్లర్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ కావడం విశేషం. టూ ఇయర్స్ బ్యాక్, ప్రీ విజన్ ఎనౌన్స్ మెంట్ అంటూ జీ2, డెకాయిట్ టైటిల్ టీజర్ ఎనౌన్స్ చేశారు. అప్పటి నుండి అప్ డేట్స్ లేవు. రీసెంట్లీ ఇదిగో డిసెంబర్ డెకాయిట్, జనవరిలో గూడఛారి 2 అప్ డేట్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను ఊరిస్తున్నాడు. రీసెంట్‌గా డెకాయిట్ టీజర్ రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచాడు. G2.. అడివి శేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన గూఢచారి చిత్రానికి సీక్వెల్. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏజెంట్ 116 తన మిషన్స్‌ని ఇంటర్నేషనల్‌గా ఎలా ఎగ్జిక్యూట్ చేసాడనేది ఈ సినిమాలో అర్జున్ పాత్ర ద్వారా చూపించబోతున్నాడు. 6 దేశాల్లో భారీ సెట్లలో చిత్రీకరిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ ప్రెస్‌మీట్‌లో రెండు సినిమాలు నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అవుతాయని అడివిశేష్ ప్రామిస్ చేసాడు.
