రాబోతున్న 21న కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫైట్ జరగబోతుంది. సీనియర్ ధనుష్.. జూనియర్ ధనుష్ మధ్య వార్ మొదలైంది. యాక్టింగ్ పరంగా ధనుష్ 100% సక్సెస్ అయ్యాడు. ఇక కావాల్సింది డైరెక్టర్ గానే. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్లీ రాయన్ తో దర్శకుడిగా సెకండ్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో.. థర్డ్ టైం తన లక్ పరీక్షించుకోతున్నాడు. మేనల్లుడు పవీష్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తీసుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి వచ్చేస్తోంది నీక్(తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా). అనిఖా సురేంద్రన్, ప్రియ ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, సిద్దార్థ్ శంకర్ కీ రోల్స్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
Pawan Kalyan: మహకుంభమేళాలో పుణ్యస్నానం చేసిన పవన్ దంపతులు
కానీ డ్రాగన్ మూవీ ఆ అంచనాలను తల్లకిందులు చేసేలా ఉంది. ఈ సీనియర్ ధనుష్ తో పోటీగా తన సినిమాను దింపేస్తున్నాడు జూనియర్ ధనుష్ అలియాస్ ప్రదీప్ రంగనాథన్. షార్ట్ ఫిల్మ్స్ స్థాయి నుండి మెగా ఫోన్ పట్టే స్థాయికి ఎదిగాడు ప్రదీప్ రంగనాథన్. కోమాలి, లవ్ టుడేతో అటు దర్శకుడిగా.. ఇటు నటుడిగా ఫ్రూవ్ చేసకున్న ప్రదీప్.. కెమెరాను కాస్త పక్కన పెట్టి.. నటనపై ఫోకస్ చేశాడు. ఓ మై కడవలే ఫేం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నాడు. ఇది కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైన్మెంటే. డ్రాగన్ కూడా ఫిబ్రవరి 21నే ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ లెక్కన బాక్సాఫీస్ దగ్గర చిన్న వారే నడవబోతుంది. మరీ సీనియర్ ధనుష్, జూనియర్ ధనుషుల్లో గెలిచేదెవరు..? దర్శకుడిగా ధనుష్ హ్యాట్రిక్ అందుకుంటాడా..? హీరోగా సెకండ్ హిట్ ప్రదీప్ ఖాతాలో పడుతుందో లేదో వేచి చూడాలి.