ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆమె పేర్కొన్నారు.
Also Read : PMF : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై కేసు నమోదు.. డైలమాలో రాజాసాబ్ రిలీజ్
సదా మాట్లాడుతూ, కొందరు డాగ్ లవర్స్ జాతి కుక్కలను కొనుగోలు చేయడం వల్ల వీధి కుక్కల సమస్య తీవ్రమైందని విమర్శించారు. “మీ వల్ల వీధి కుక్కలు వీధుల్లోనే మిగిలాయి” అని ఆమె అన్నారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఏ అధికారులను సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లి నిరసన తెలియజేయాలో నాకు తెలియడం లేదు. కానీ నేను చెప్పగలిగేది ఒక్కటే. ఇది నన్ను లోపల చంపేస్తోంది. ఇది అస్సలు సరైనది కాదు. మన పట్ల నాకు సిగ్గుగా ఉంది. మన దేశం పట్ల నాకు సిగ్గుగా ఉంది. తీర్పు వెలువరించే ముందు రెండుసార్లు ఆలోచించని వారి పట్ల నాకు సిగ్గుగా ఉంది. దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’ అని ఆమె కన్నీళ్లతో అన్నారు.
Also Read : Dil Raju : ఫెడరేషన్తో చివరి దశ చర్చలు!
కేవలం సదా మాత్రమే కాదు జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, చిన్మయి శ్రీపాద, వరుణ్ గ్రోవర్, వీర్ దాస్‌లు సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం చేశారు, దీనిని “కుక్కలకు మరణశిక్ష”గా అభివర్ణించారు. సుప్రీంకోర్టు ఈ చర్యను రేబిస్ మరణాలు, కుక్కల దాడుల పెరుగుదల నేపథ్యంలో తీసుకుంది, అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
