ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని…