ప్రముఖ హాలీవుడ్ టెలివిజన్ షోలు ‘ది వాకింగ్ డెడ్’, ‘చికాగో మెడ్’ ద్వారా ప్రాచుర్యం పొందిన నటి కెల్లీ మాక్ (Kelly McC) ఎంతో చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె వయస్సు 33 సంవత్సరాలు మాత్రమే. ఈ విషాద వార్త అభిమానుల హృదయాలను కలిచివేస్తోంది. గత సంవత్సరం, కెల్లీకి గ్లియోమా అనే కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయ్యింది. ఇది వేగంగా అభివృద్ధి చెందే, అరుదైన క్యాన్సర్ రకం. దీని నుండి ఆమె తీవ్రంగా పోరాడి నప్పటికీ.. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత విషమించి, చివరకు ప్రాణాలు కోల్పోయారు.
Also Read : War 2 : వార్ 2 చేయడానికి కారణం ఇదే – ఎన్టీఆర్
ఈ వార్తను ఆమె సోదరి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.. ‘చివరికి మనమందరం కూడా అక్కడకే వెళ్లాలి’ అంటూ భావోద్వేగంతో రాసింది. కెల్లీ మాక్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కినట్టే, ఆడియన్స్ హృదయాల్లో తనదైన గుర్తింపు సాధించారు. ఆమె నేచురల్ యాక్టింగ్ , నిఖార్సైన భావప్రకటన తో ప్రేక్షకుల మదిలో ఎప్పుడు గుర్తుండిపోయే వ్యక్తిత్వం సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె చేసిన పాత్రలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. దీంతో ఆమె మృతి వార్తపై హాలీవుడ్ వర్గాలు, సహ నటులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.