War 2 : వార్ 2 చేయడానికి కారణం ఇదే – ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం ‘వార్ 2’ . వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ లో ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా తొలిసారి ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌పై ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియాకి ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఈ సినిమాను ఎందుకు అంగీకరించాననే ఆసక్తికర విషయం బయటపెట్టారు.
Also Read :Chiranjeevi : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అసలు కథ తెలుసా?
Also Read
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
- Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
- Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
‘ ‘వార్ 2’ సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా టెక్నీషియన్లు కలిసి పనిచేశారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు.. మనమంతా ఇప్పుడు ఒక్కటే – ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనే వేరు వేరు పేర్లు ఇక ఉండకూడదు. ఇదే విషయాన్ని రాజమౌళి గారు ఒక సందర్భంలో చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే కథ తీయగలిగితే, భాష ఎలాంటి అడ్డంకి కాదు. హిట్ అవ్వడానికి ఎటువంటి ప్రత్యేక ఫార్ములా అవసరం లేదు. ‘వార్ 2’ ని నేను ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని బలమైన స్క్రిప్ట్. కథ నన్ను గట్టిగా ఆకట్టుకుంది. హృతిక్ రోషన్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. జీవితంలో ఏదీ ప్లాన్ చేసుకోనని అన్నారు. వచ్చిన అవకాశాలను నిజాయతీగా వినియోగించుకుంటా’ అని తెలిపారు.. అలాగే తారక్ తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు.. ‘ నేను నటుడిని మాత్రమే కాదు.. గొప్ప చెఫ్‌నని కూడా. నా భార్య ప్రణతి కోసం, నా స్నేహితుల కోసం వంట చేయడం నాకెంతో ఇష్టం. పునుగులు బాగా వేస్తాను. నా చేతి బిర్యాని కూడా సూపర్ ఉంటుంది’ అని తెలిపారు .
తాజావార్తలు
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!