హీరోయిన్ అన్షు మీద డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి. ఆమె కొంచెం సన్నగా ఉందని, తెలుగు వాళ్లకు అన్నీ పెద్ద సైజుల్లోనే ఉండాలని చెప్పానని, అందుకే కొంచెం లావు అయిందని ఆయన కామెంట్ చేశారు. అయన కామెంట్లు అభ్యకరంగా ఉన్నాయని అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. తాజాగా త్రినాథరావు కూడా ఈ కామెంట్స్ గురించి క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇపుడు హీరోయిన్ అన్షు కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆమె మాట్లాడుతూ అందరికీ హలో, మజాకా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్, నా పాత్ర మీద మీరు చూపిస్తున్న ప్రేమను చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. మిమ్మల్ని చాలా కాలం తరువాత ఎంటర్ టైన్ చేయడానికి వేచి ఉండలేక పోతున్నాను.
Akhanda 2: మహా కుంభమేళాలో ‘అఖండ 2:’ షూటింగ్ ప్రారంభం
నిన్న ఓ అద్భుతమైన సాయంత్రం, నా మీద ప్రేమ కురిపిస్తూ ఎన్నో మెసేజిలు, ఫోన్లు వచ్చాయి. మీడియాకి కూడా థాంక్స్, నా గురించి చాలా మంచిగా మాట్లాడారు. త్రినాధ్ గారు చేసిన కొన్ని కామెంట్ల వలన అనేక కధనాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఆయన గురించి మీకు చెప్పాలి, భూమ్మీదున్న లవ్లీయస్ట్ మ్యాన్ త్రినాథరావు, ఆయన మాటలని వక్రీకరించారని నేను నమ్ముతున్నాను. ఆయన నన్ను కుటుంబ సభ్యరాలిగా చూస్కున్నారు. నేను ఆయన సినిమాలో 60 రోజులు పని చేశాను, నన్ను గౌరవంగా చూసుకున్నారే తప్ప ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. ఇక ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేద్దాం, ఎందుకంటే నేను సినిమా కోసం చాలా ఆసక్తిరేకంగా ఎదురుచూస్తున్నాను. నన్ను ఈయన కంటే మంచి కంబ్యాక్ ఎవరూ ఇవ్వలేరనే అనుకుంటున్నాను.