మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ఇంకా కేవలం 12 రోజులే బాలెన్స్ ఉంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ సమస్య తలెత్తి ఉండకపోతే… ‘ఆచార్య’ ముందు అనుకున్న విధంగా మే 13న విడుదలై ఉండేది. కానీ ఊహించని విధంగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ మెగా ప్రాజెక్ట్ షూటింగ్ లో సైతం అంతరాయం కలిగింది. ఇప్పుడు దీనిని ఏ తేదీన విడుదల చేసేది నిర్మాతలు తెలియ చేయకపోయినా… షూటింగ్ చేయాల్సింది మాత్రం 12 రోజులే అని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు.
Read Also: కత్తి మహేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం!
ఇదిలా ఉంటే… సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొరటాల శివ దాని నుండి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన కారణాన్ని సైతం ఆయన ఆ తర్వాత వివరించారు. ‘ఆచార్య’ సినిమాతో పాటు ఎన్టీయార్ మూవీ సైతం వెంటనే మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ సినిమాల పోస్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలతో బిజీగా ఉన్న తాను సోషల్ మీడియాకు టైమ్ కేటాయించలేక పోతున్నానని కొరటాల తెలిపారు. నిజానికి నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తున్న సమయంలోనే అభిమానులకు ఎవరైనా అందుబాటులో ఉండాలి, తమ సినిమాల ప్రోగ్రెస్ లను తెలియ చేస్తుండాలి. కానీ కొరటాల మాత్రం వృత్తిపరమైన ఒత్తిడి కారణంగానే ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నానని చెబుతున్నారు. ఇదిలా ఉంటే… కొరటాల కమిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో ఏవేవి సెట్స్ పైకి వెళతాయి, ఏవి డ్రాప్ అవుతాయనేది తాను ఇప్పుడే చెప్పలేనని కొరటాల శివ అంటున్నారు.