Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
తమిళ బిగ్ బాస్ విజేత ఆరి అర్జునన్ ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్) అనే చిత్రం ద్వారా ఆరి టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా ఒక ఆసక్తికరమైన క్రాస్ ఓవర్ జరుగుతోంది. ఆరి అర్జునన్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇందులో ఆయన ఒక నిజాయితీ గల, ముక్కుసూటిగా వ్యవహరించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్ తరుణ్ ఈ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతుండటం విశేషం. ఆయన పాత్ర చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం.
ఇటీవలే విడుదలైన ‘GS’ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. సినిమా కథను పూర్తిగా రివీల్ చేయకుండా, కేవలం ఉత్కంఠభరితమైన విజువల్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. విజయ్ మిల్టన్ విజువల్స్, సామ్ సి.ఎస్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, భరత్ మరియు అమ్ము అభిరామి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆరి అర్జునన్ కేవలం హీరోగానే కాకుండా, సుందర్ బాబు, ముత్తయ్య అళగర్స్వామి మరియు జయ శీలన్ హెన్రీలతో కలిసి రఫ్ నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!