Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ ఈ శుక్రవారం (నవంబర్ 20న) తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ సినిమాలో కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయం అవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే, ఇంత పెద్ద బ్యానర్లు, దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్న ప్రాజెక్ట్‌లో ఒక స్టార్ హీరోయిన్ను కాకుండా కొత్త అమ్మాయిని ఎందుకు తీసుకున్నారనే చర్చ మొదటి నుంచీ నడుస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ పవన్ సాధినేని దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు. ‘ఆకాశంలో ఒక తార’ కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని పవన్ సాధినేని తెలిపారు. “ఇలాంటి సినిమాలకు ఆల్రెడీ పేరున్న స్టార్ హీరోయిన్ను తీసుకుంటే మాకు సేఫ్ ఆప్షన్ అయ్యేది. కానీ, ఈ పాత్రకు ఒక కొత్త అమ్మాయి అయితేనే ఆడియన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని మొదటి నుంచీ అనుకున్నాం. అలా హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో సోషల్ మీడియాలో సాత్విక వీరవల్లి రీల్స్ చూశాను. తనకు భరతనాట్యం కూడా వచ్చు. వెంటనే ఆడిషన్ చేసి ఎంపిక చేశాం. ఆ పాత్రలో తను చాలా బాగా ఒదిగిపోయింది” అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
Also Read
- ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
- NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
- Gopichand: విలన్‌గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
- Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
మరోవైపు, ఈ సినిమాలో శ్రుతి హాసన్ పోషించిన పాత్ర గురించి కూడా పవన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కథలో శ్రుతి హాసన్ రోల్ చాలా కీలకమని, ఇప్పటివరకు ఆమె చేసిన అన్ని పాత్రల్లోకి ఇది బెస్ట్ అవుతుందని తెలిపారు. థియేటర్లో ఆమె క్యారెక్టర్ చూసి ప్రతి మహిళ ఇన్స్పైర్ అవుతారని చెప్పారు. అల్లు అరవింద్, స్వప్న దత్, సందీప్ గుణ్ణం వంటి నిర్మాతలు ఈ కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చేశారని పవన్ సాధినేని గుర్తుచేసుకున్నారు. తాను చెప్పిన కథలో ఒక్క మార్పు కూడా సూచించకుండా, ఏం చెప్పానో అదే తీయమని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. ఫ్యామిలీ, పిల్లలతో కలిసి థియేటర్లలో చూడాల్సిన గొప్ప అనుభూతినిచ్చే సినిమా ఇదని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Food Safety Raids: హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్, 2 సీజ్..
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
-
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ముందున్నాం
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..